అదానీ గ్రీన్... రూ. మూడు ట్రిలియన్ మార్కును దాటిన మార్కెట్ క్యాప్...

ABN , First Publish Date - 2022-01-20T02:10:30+05:30 IST

అదానీ గ్రీన్ ఎనర్జీ(ఏజీఈఎల్) షేర్లు జోరును కొనసాగిస్తున్నాయి. బుధవారం ఇంట్రా-డేలో బీఎస్ఈలో ఏజీఈఎల్ 2.6 శాతం పెరిగి, రూ. 1,955.90 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది.

అదానీ గ్రీన్... రూ. మూడు ట్రిలియన్ మార్కును దాటిన మార్కెట్ క్యాప్...

న్యూఢిల్లీ : అదానీ గ్రీన్ ఎనర్జీ(ఏజీఈఎల్) షేర్లు జోరును కొనసాగిస్తున్నాయి. బుధవారం ఇంట్రా-డేలో బీఎస్ఈలో ఏజీఈఎల్ 2.6 శాతం పెరిగి, రూ. 1,955.90 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. కాగా...  ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 11:01 గంటలకు 0.77 శాతం క్షీణించి, రూ. 60,285 వద్ద ఉంది. గత పధ్నాలుగు ట్రేడింగ్ సెషన్‌లలో, డైవర్సిఫైడ్ అదానీ గ్రూప్ పునరుత్పాదక ఇంధన విభాగం స్టాక్ మొన్న  డిసెంబరు  30 న రూ. 1,307.05 నుంచి 50 శాతం జూమ్ చేసింది.


ఇదే కాలంలో ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్ 4.3 శాతం పెరిగింది. కాగా...  కంపెనీ స్టాక్ ధరలో భారీ ర్యాలీ కనిపించింది. ఈ క్రమంలో... ఈ రోజు(బుధవారం) రూ. 3 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను అధిగమించిన మొదటి అదానీ గ్రూప్ కంపెనీగా ఏజీఈఎల్ నిలిచింది. ప్రస్తుతం... ఏజీఈఎల్ మార్కెట్ క్యాప్ రూ. 3.04 ట్రిలియన్లుగా బీఎస్ఈ డేటా చెబుతోంది.


అదానీ గ్రూప్‌లో... అదానీ ట్రాన్స్‌మిషన్(రూ. 2.15 ట్రిలియన్లు), అదానీ ఎంటర్‌ప్రైజెస్(రూ. 2.00 ట్రిలియన్లు), అదానీ టోటల్ గ్యాస్ (రూ. 1.95 ట్రిలియన్లు), అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (రూ. 1.52 ట్రిలియన్లు), ఇతర అదానీ గ్రూప్ కంపెనీలు రూ. 1.5 ట్రిలియన్లకు పైగా మార్కెట్ క్యాప్‌ను కలిగి ఉన్నాయి. ఇక... 4,667 మెగావాట్లను సరఫరాకు సంబంధించి... ‘ఎస్‌ఈసీఐ’తో ప్రపంచంలోనే అతిపెద్ద ‘గ్రీన్ పీపీఏ’పై సంతకం చేసినట్లు కంపెనీ వెల్లడించింది. 

Updated Date - 2022-01-20T02:10:30+05:30 IST