రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి మా కుటుంబంలో ఎవరికీ లేదు: Adani

ABN , First Publish Date - 2022-05-15T21:10:22+05:30 IST

రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి తమ కుటుంబంలో ఎవరికీ లేదని వ్యాపారివేత్త గౌతమ్ ఆదానీ స్పష్టం చేశారు.

రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి మా కుటుంబంలో ఎవరికీ లేదు: Adani

Delhi: రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి తమ కుటుంబంలో ఎవరికీ లేదని ప్రముఖ వ్యాపారివేత్త గౌతమ్ ఆదానీ (Adani) స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) నుంచి తనకు గానీ, తన భార్య ప్రీతి అదానీకి గానీ రాజ్యసభ సీటు అంటూ వస్తున్న వార్తలను ఆదానీ ఖండించారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభ సీట్లు ఖాళీ అయినప్పుడల్లా తమ పేరును తెరపైకి తెస్తున్నారని, రాజ్యసభ సీట్ల విషయంలో తమ పేరును లాగడం దురదృష్టకరమన్నారు. అదానీ కుటుంబ సభ్యులెవరికీ రాజకీయ జీవితంపై ఆసక్తి లేదని ఆదానీ స్పష్టం చేశారు.

Updated Date - 2022-05-15T21:10:22+05:30 IST