చుక్కలనంటిన అదానీ ‘బొగ్గు’ ధర

ABN , First Publish Date - 2022-04-04T08:04:21+05:30 IST

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పైనా కనిపిస్తోంది. ఈ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధర భారీగా పెరిగింది.

చుక్కలనంటిన అదానీ ‘బొగ్గు’ ధర

రెండు టెండర్లు రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్‌  

న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పైనా కనిపిస్తోంది. ఈ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధర భారీగా పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని ధర్మల్‌  విద్యుత్‌ కేంద్రాలకు సరఫరా చేసే దిగుమతి చేసుకునే బొగ్గు ధరా గణనీయంగా పెరిగిపోయింది. దక్షిణాఫ్రికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గులో ఐదు లక్షల టన్ను లు.. టన్ను 526.50 డాలర్ల (సుమారు రూ.40,000) చొప్పున, మరో 7.5 లక్షల టన్నులు.. టన్ను 230.08 డాలర్ల (సుమారు రూ.17,480) చొప్పున ఈ కేంద్రాలకు అవసరమైన బొగ్గును సరఫరా చేసేందుకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రెండు టెండర్లు దాఖలు చేసింది. అలాగే అగర్వాల్‌ అనే కంపెనీ ఇంతకంటే ఎక్కువ ధర కోట్‌ చేసింది. దీంతో ఈ రెండు టెండర్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కే దక్కుతాయని భావించారు.

ఇంత ధరా?: అయితే అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కోట్‌ చేసిన ధర చూసి అమ్మో ఇంత ధరా? అని రాష్ట్ర జెన్‌కో అధికారు లు నోరెళ్లబెట్టినట్టు రాయిటర్స్‌ వార్తాసంస్థ కథనం వెల్లడిం చింది. దాంతో అదానీ దాఖలు చేసిన రెండు టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసినట్టు రాయిటర్స్‌ పేర్కొంది. అధిక ధర కారణంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు దిగుమతి టెండర్‌ రద్దు చేయడం ఇదే మొదటిసారని తెలిపింది. 


Updated Date - 2022-04-04T08:04:21+05:30 IST