బెజోస్, ఎలాన్‌ మస్క్‌లను మించిపోయిన అదానీ

ABN , First Publish Date - 2021-03-12T21:23:25+05:30 IST

ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వే స్టేషన్లు, పోర్టులు, డాటా సెంటర్లు, బొగ్గు గనుల ద్వారా ఇంత ఎక్కువ స్థాయిలో అదానీ లాభాలు ఆర్జించారని బ్లూమ్‌బర్గ్ బిలయనీర్ ఇండెక్స్ పేర్కొంది. ప్రస్తుతం వచ్చిన 16.2 బిలియన్ డాలర్ల ఆదాయంతో అదానీ

బెజోస్, ఎలాన్‌ మస్క్‌లను మించిపోయిన అదానీ

న్యూఢిల్లీ: ఇండియాలోని ప్రముఖ వ్యాపారవేత్త అయిన గౌతమ్ అదానీ.. ప్రపంచ కుబేరులైన జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్‌లను మించి 2021లో ఆదాయాన్ని ఆర్జించారు. గడిచిన రెండు నెలల్లోనే ఆయన 16.2 బిలియన్ డాలర్ల నికర ఆదాయాన్ని అదానీ ఆర్జించారని బ్లూమ్‌బర్గ్ బిలయనీర్ ఇండెక్స్ తెలిపింది. దీంతో ఈ ఏడాదిలో అత్యంత ఆదాయాన్ని ఆర్జించి ప్రపంచ కుబేరులందరినీ అదానీ వెనక్కి నెట్టారు.


ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వే స్టేషన్లు, పోర్టులు, డాటా సెంటర్లు, బొగ్గు గనుల ద్వారా ఇంత ఎక్కువ స్థాయిలో అదానీ లాభాలు ఆర్జించారని బ్లూమ్‌బర్గ్ బిలయనీర్ ఇండెక్స్ పేర్కొంది. ప్రస్తుతం వచ్చిన 16.2 బిలియన్ డాలర్ల ఆదాయంతో అదానీ సంపద 50 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక పోతే ఇండియాలో 1 గిగావాట్‌తో కూడా డాటా సెంటర్ తెరిచేందుకు పోయిన నెలలో ఒప్పందం కుదిరింది. ఇప్పటికే డాటా సెంటర్లలో లాభాల్లో దూసుకుపోతున్న అదానీకి ఇది మరింతగా కలిసి వస్తుందని బిజినెస్ పండితులు అంటున్నారు.

Updated Date - 2021-03-12T21:23:25+05:30 IST