ఎట్టకేలకు గాళ్ ఫ్రెండ్‌ను పెళ్లాడిన ఆర్సీబీ బౌలర్

ABN , First Publish Date - 2021-06-22T02:19:48+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్

ఎట్టకేలకు గాళ్ ఫ్రెండ్‌ను పెళ్లాడిన ఆర్సీబీ బౌలర్

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్ ఆడం జంపా ఎట్టకేలకు ఓ ఇండివాడయ్యాడు. కరోనా మహమ్మారి కారణంగా జంపా వివాహం ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు గత వారం ఎంతోకాలంగా ప్రేమిస్తున్న హట్టీ లీ పాల్మెర్‌ను పెళ్లాడాడు. గతేడాది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు లాక్‌డౌన్‌లో చిక్కుకోవడంతో జంపా సహా పలువురి వివాహాలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత వారిలో చాలామంది ఏదో రకంగా వివాహాలు చేసుకుని జంటలుగా మారారు. వైరస్ ఇంకా భయపెడుతుండడంతో కొందరు క్రికెటర్లు మాత్రం ఇంకా శుభ ఘడియల కోసం ఎదురుచూస్తున్నారు.


ఆడం జంపా గతవారమే వివాహం చేసుకున్నప్పటికీ ఆ విషయాన్ని ఇప్పటి వరకు రహస్యంగా ఉంచాడు. అయితే, జంపా గాళ్‌ఫ్రెండ్ హట్టీ లీ వివాహ దుస్తులను డిజైన్ చేసిన కేట్ వాలియా అనే కంపెనీ వీరిద్దరి వివాహ ఫొటోను పోస్టు చేయడంతో జంపా వివాహం వెలుగులోకి వచ్చింది.

Updated Date - 2021-06-22T02:19:48+05:30 IST