Abn logo
Mar 28 2020 @ 20:33PM

ఆదా శర్మను చూసి ఫిదా కానివారెవరు?

అందాల భామ ఆదా శర్మ హోమ్ క్వారంటైన్‌ను సరదాగా గడిపేస్తోంది. తనలోని టాలెంట్‌కు ఓ వేదికగా చేసుకుంటుంది. 21 రోజుల లాక్‌డౌన్ పిరియడ్‌ను ఒక్కో రోజు ఒక్కోలా ప్లాన్ చేసుకుంది. పియానో వాయిస్తూ, అద్దంపై పేరుకున్న డస్ట్‌ను, ఫ్లోర్‌ను క్లీన్ చేస్తూ ఏదో ఒక పనిచేస్తూ హోమ్ క్వారంటైన్‌కు తనదైన అర్థం చెబుతోంది. అయితే తను అద్దాల దుమ్ము దులుపుతున్నప్పుడు బ్యాలే డ్యాన్స్ చేస్తూ.. ఫ్లోర్‌ను క్లీన్ చేస్తున్నప్పుడు వర్కవుట్స్ చేస్తూ అందరినీ అలరిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తోంది. అంతేగాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను పాటిస్తూ.. ఇంటి దగ్గరే ఉండంటూ తన అభిమానులకు, ప్రజలకు పిలపునిస్తోంది ఈ సుందరాంగి. 

Advertisement
Advertisement
Advertisement