తెలుగునాట `హార్ట్ఎటాక్`తో సందడి చేసిన హీరోయిన్ అదాశర్మ ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లపై కూడా దృష్టి సారించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా అదా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
డేటింగ్ యాప్స్, వివాహేతర సంబంధాల నేపథ్యంలో తెరకెక్కిన `టిండే` అనే షార్ట్‌ఫిల్మ్‌లో అదా నటించింది. దీనిలో అదా నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన అదా.. వివాహేతర సంబంధాల గురించి స్పందించింది. `రొమాన్స్ విషయంలో ఆధునిక పోకడలు నాకే మాత్రం నచ్చవు. వివాహేతర సంబంధాలకు నేను పూర్తి వ్యతిరేకం. రొమాన్స్ విషయంలో పాత కాలం పద్ధతులనే ఇష్టపడతా. మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని అతనితోనే బంధాన్ని కొనసాగించడం మంచి పద్ధతి. నైతిక విలువలు కలిగిన వ్యక్తినే జీవిత భాగస్వామిగా ఎంచుకుంటాన`ని అదా తెలిపింది.