కౌలు రైతుకు కార్డు ఉంటేనే రాయితీ

ABN , First Publish Date - 2022-06-30T03:52:44+05:30 IST

కౌలు రైతులకు కౌలు కార్డులుంటనే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అందుతాయని వింజమూరు సహాయక వ్యవసాయ సంచాయలకులు ఎన్‌. రామిరెడ్డి అన్నారు.

కౌలు రైతుకు కార్డు ఉంటేనే రాయితీ
పత్తి రైతులకు సూచనలిస్తున్న వ్యవసాయ అధికారులు

కొండాపురం, జూన్‌ 29: కౌలు రైతులకు కౌలు కార్డులుంటనే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అందుతాయని వింజమూరు సహాయక వ్యవసాయ సంచాయలకులు ఎన్‌. రామిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని నేకునాంపేట, సాయిపేట, గుడవళ్లూరు, సత్యవోలు, పార్లపల్లి పంచాయతీలలో రైతులు ఇటీవల సాగు చేసిన నువ్వు, సజ్జ, పత్తి తదితర పంటలను ఆయన పరిశీలించారు. పత్తి పంటను ప్రధానంగా గులాబిరంగు పురుగు ఆశించి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని, దాని నివారణ చర్యలు సూచించారు.  ఆయన వెంట వ్యవసాయ అధికారిణి ప్రసూన, వీఏఏలు, రైతులు ఉన్నారు.

Updated Date - 2022-06-30T03:52:44+05:30 IST