23, 24 తేదీల్లో యాడ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌

ABN , First Publish Date - 2022-08-20T06:08:12+05:30 IST

తెలంగా ణ భాషా సాంస్కృతిక శాఖ, జీఎన్‌ఆర్‌ యాడ్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో

23, 24 తేదీల్లో యాడ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌

రవీంద్రభారతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): తెలంగా ణ భాషా సాంస్కృతిక శాఖ, జీఎన్‌ఆర్‌ యాడ్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 23, 24 తేదీల్లో రవీంద్రభారతి వేదికగా యాడ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తెలిపారు. ఈమేరకు శుక్రవారం వర్క్‌షా్‌పనకు సంబంధించిన పోస్టర్‌ను రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔత్సాహికులు ఈ వర్క్‌షా్‌పను సద్వినియోగించుకోవాలని అన్నారు. వివరాలకు 9014198366, 7661085248, 9392462676 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. 

Updated Date - 2022-08-20T06:08:12+05:30 IST