ఎడిసెట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2022-07-03T04:43:54+05:30 IST

డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ ఆర్కిటెక్చర్‌ ఫైనార్ట్స్‌ యూనివర్శిటీలో బ్యాచి లర్‌ ఆఫ్‌ ఫైనార్ట్స్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు ఎడిసెట్‌ 2022 నోటిఫికేషన్‌ను ఇన్‌ఛార్జి వీసీ సూర్యకళావతి, ఎడిసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సురేంద్రనాథరెడ్డి సంయుక్తంగా విడుదల చేశారు.

ఎడిసెట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల

కడప వైవీయూ, జూలై 2: డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ ఆర్కిటెక్చర్‌ ఫైనార్ట్స్‌ యూనివర్శిటీలో బ్యాచి లర్‌ ఆఫ్‌ ఫైనార్ట్స్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు ఎడిసెట్‌ 2022 నోటిఫికేషన్‌ను ఇన్‌ఛార్జి వీసీ సూర్యకళావతి, ఎడిసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సురేంద్రనాథరెడ్డి సంయుక్తంగా విడుదల చేశారు. 2022-23 విద్యాసంవత్సరంలో యానిమేషన్‌ అప్లైడ్‌ ఆర్ట్స్‌, పెయింటింగ్‌, కల్చలర్‌, ఫొటోగ్రఫి, ఇంటీరియర్‌ డిజైన్లలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థినీ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వెబ్‌ సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా జూలై 4 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చ న్నారు. వివరాలకు ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఆర్కిటెక్చర్‌ యూనివర్శిటీ వెబ్‌సైట్‌లో విద్యార్థులు చూడవచ్చన్నారు. 


Updated Date - 2022-07-03T04:43:54+05:30 IST