కరోనా మరణాల సంఖ్య వాస్తవానికి పది లక్షల కంటే ఎక్కువే: డబ్ల్యూహెచ్ఓ

ABN , First Publish Date - 2020-10-01T04:54:22+05:30 IST

కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య వాస్తవానికి పది లక్షల కంటే కచ్చితంగా ఎక్కువగానే

కరోనా మరణాల సంఖ్య వాస్తవానికి పది లక్షల కంటే ఎక్కువే: డబ్ల్యూహెచ్ఓ

జెనీవా: కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య వాస్తవానికి పది లక్షల కంటే కచ్చితంగా ఎక్కువగానే ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ వెల్లడించారు. బుధవారం యూఎన్‌జీఏ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పది లక్షల మంది కరోనా కారణంగా మరణించినట్టు లెక్కలు చెబుతున్నాయని.. అసలైన సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఆసుపత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారన్నారు. కరోనా పరీక్షలు, చికిత్స, వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రపంచదేశాలు కలిసి పనిచేయాలని.. అందరికి సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కోరారు. కాగా.. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3 కోట్ల 37 లక్షల 6 వేల 888 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోపక్క కరోనా బారిన పడి మొత్తం 10 లక్షల 9 వేల 64 మంది మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-10-01T04:54:22+05:30 IST