Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 19 Jan 2022 11:32:52 IST

ఆ పాత్రకి తన ఎంపిక సరికాదన్న Priyanka chopra.. అభినందించిన సహ నటి

twitter-iconwatsapp-iconfb-icon
ఆ పాత్రకి తన ఎంపిక సరికాదన్న Priyanka chopra.. అభినందించిన సహ నటి

ప్రస్తుతం హలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ప్రియాంక చోప్రా. గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లోనూ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది ఈ బ్యూటీ. హిందీ చిత్ర పరిశ్రమలో టాప్ స్టార్స్‌ సినిమాల్లో నటిస్తూనే.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు సైతం చేసింది. అందులో ముఖ్యమైంది ‘మేరీ కోమ్’. ఆ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది ఈ భామ.


అందులో ప్రియాంక మాట్లాడుతూ.. ‘ఎంతో మంది మహిళా క్రీడాకారిణులకు స్ఫూర్తి కలిగిస్తూ ఇప్పటికి బ్రతికి ఉన్నా ఓ అథ్లెట్ ‘మేరీ కోమ్ పాత్రలో నేను సెట్ అవుతానా లేదా అని సందేహాస్పదంగా ఉన్నాను. పైగా, నేను ఆమెలా కనిపించడం లేదు. అంతేకాకుండా ఆమె భారతదేశం ఈశాన్య ప్రాంతానికి చెందినది కాగా.. నేను ఉత్తర భారతదేశాని చెందిన దానిని. భౌతికంగా ఒకేలా కనిపించను. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఆ పాత్ర ఈశాన్య స్టేట్స్‌కి చెందిన ఎవరైనా చేసి ఉంటే బావుండేదని అనిపిస్తోంద’ని చెప్పుకొచ్చింది.

ఆ పాత్రకి తన ఎంపిక సరికాదన్న Priyanka chopra.. అభినందించిన సహ నటి

‘మేరీ కోమ్’లో స్నేహితురాలి పాత్ర పోషించిన లిన్ లైష్రామ్, ప్రియాంక  వ్యాఖ్యలపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ‘ఇలాంటి విషయాలను అంగీకరించమే కాకుండా, బహిరంగంగా మాట్లాడేందుకు ప్రియాంకకి ధైర్యం ఉండడం చాలా గ్రేట్. దీంతో ఆమెపై నాకున్న అభిమానం ఇంకా పెరిగింది. మీరు ఆ పాత్ర చేయకపోతే తప్ప, అలాంటి తప్పు ఎంపికను అర్థం చేసుకోవడం చాలా కష్టం అని నేను భావిస్తున్నాను. ఓటీటీ ప్రాముఖ్యత పెరగడంతో టాలెంట్, ప్రామాణికతకి ప్రాధాన్యత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మంచి రోజులు ముందున్నాయని ఆశిస్తున్నాన’ని చెప్పింది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement