Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 05 Dec 2021 19:13:11 IST

Taapsee : ‘అటువంటి సినిమాల్లో’ ఛాన్సుల కోసం... ‘అందంగా, తెలివితక్కువగా’ కనిపించిందట!

twitter-iconwatsapp-iconfb-icon

తాప్సీ పన్ను... ఇప్పుడు బీ-టౌన్‌లో ఈ పేరొక బ్రాండ్. ఎందుకంటే, ఆమె సినిమాల్లో హీరో ఎవరన్నది ఆడియన్స్ పట్టించుకోవటం మానేస్తున్నారు! క్రమంగా తన సినిమాలకి తానే బిగ్గెస్ట్ అట్రాక్షన్‌గా ఎదుగుతోంది సొట్ట బుగ్గల బ్యూటీ! అలాగని తాప్సీ అందాల ఆరబోతతో రచ్చ చేయటం లేదు. కెరీర్ మొదట్లో ఆ పని చేస్తేనే బెడిసికొట్టిందని చెబుతోంది టాలెంటెడ్ యాక్ట్రస్... 


త్వరలో ఇండియన్ ఉమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్‌గా తెరపై కనిపించబోతోన్న తాప్సీ వరుసగా కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తూ వస్తోంది. ముందు ముందు కూడా ఆమె నుంచీ దాదాపు అరడజను ఆసక్తికర చిత్రాలు రానున్నాయి. కానీ, తాప్సీ కెరీర్ మొదట్లో తెలుగు, తమిళ సినిమాలు చేస్తున్నప్పుడు రాంగ్ రూట్‌లో వెళ్లిందట. పెద్ద హీరోల పెద్ద బడ్జెట్ సినిమాల్లో నటిస్తేనే స్టార్ అవ్వొచ్చని ఆమెకు చాలా మంది సలహాలిచ్చారట. దాంతో అందంగా మెరిసిపోయేందుకు విపరీతంగా ట్రై చేసేదట. అంతే కాదు, ఒకింత తెలివితక్కుగా కూడా కనిపించే ప్రయత్నం చేసేదట. ‘బ్యూటీ వితవుట్ బ్రెయిన్స్’ అంటారు కదా... అలా!


హీరోల చుట్టూ తిరిగే సినిమాల్లో ‘గ్లామరస్ అండ్ డంబ్’గా కనిపించేందుకు కొంత కాలం ట్రై చేసిన తాప్సీ అది దండగని గ్రహించానని చెప్పింది. సౌత్ చిత్రాలు తగ్గించి బాలీవుడ్‌కు వచ్చాక ఆ తప్పు మళ్లీ చేయలేదట. అందం కంటే పర్ఫామెన్స్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. రొటీన్‌కు భిన్నంగా ఉండే సినిమాల్లో ఏ టాప్ హీరో లేకున్నా నటిస్తోంది. అదే ‘తప్పడ్’ బ్యూటీకి వర్కవుట్ అవుతోంది కూడా. ప్రస్తుతం కంగనా లాగే తాప్సీ కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.               

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement