అవి జీవితంలో భాగం కాదు!

ABN , First Publish Date - 2021-03-07T05:30:00+05:30 IST

‘‘కొద్దిరోజుల క్రితం నేను నా స్నేహితురాలి ఇంటికి వెళ్లాను. అక్కడ వాళ్ల కజిన్‌ను చూశాను. ఆమె చాలా నీరసంగా కనిపించింది. మాతో ఎక్కువ సేపు కూర్చోలేకపోయింది. అంతేకాదు ఆ అమ్మాయి ఇబ్బంది పడుతూ నడవడం గమనించి నా స్నేహితురాలిని

అవి జీవితంలో భాగం కాదు!

ఎవరూ మాట్లాడడానికి సాహసించని పలు విషయాల మీద కుండబద్దలు కొట్టినట్టు తన అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు నటి తాప్సీ పన్నూ. ‘‘సాంకేతికంగా ప్రపంచం ఎంతో పురోగతి సాధించింది. కానీ ఇప్పటికీ పీరియడ్‌ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో అమ్మాయిలు, మహిళల జీవితాలను మెరుగుపరిచే దిశగా మాత్రం అనుకున్నంత పురోగతి సాధించలేదు. అంటూ తాప్సీ ఈమధ్యే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్‌ చేశారు.. అందులో ఏం చెప్పారంటే...


పీరియడ్‌ ర్యాషెస్‌ మీద బహిరంగంగా మాట్లాడమే కాదు ఈ ఇబ్బందిని అధిగమించే మార్గాలను కూడా అన్వేషించాలి.


‘‘కొద్దిరోజుల క్రితం నేను నా స్నేహితురాలి ఇంటికి వెళ్లాను. అక్కడ వాళ్ల కజిన్‌ను చూశాను. ఆమె చాలా నీరసంగా కనిపించింది. మాతో ఎక్కువ సేపు కూర్చోలేకపోయింది. అంతేకాదు ఆ అమ్మాయి ఇబ్బంది పడుతూ నడవడం గమనించి నా స్నేహితురాలిని ‘తను బాగానే ఉందా’ అని అడిగాను. అందుకు నా ఫ్రెండ్‌ ‘ఆమెకు ఇప్పుడే నెలసరి మొదలైంది. పీరియడ్‌ ర్యాషెస్‌ వస్తాయి కదా! ఈ సమయంలో ఎలా ఉండాలో రానురాను నేర్చుకుంటుందిలే’అని చెప్పింది. పీరియడ్‌ ర్యాషెస్‌ను తేలిగ్గా తీసుకోవడం చూసి నేను షాక్‌ అయ్యాను. బాగా చదువుకున్న వాళ్లు, ఏ లోటూ లేని కుటుంబాలలో కూడా ఇదే భావన ఉండడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. 


సంప్రదాయ ప్యాడ్స్‌తో అనర్థాలు

‘మనం పీరియడ్‌ ర్యాషెస్‌ను జీవితంలో భాగమని ఎందుకు అనుకుంటున్నాం’ అనేది నా ప్రశ్న. ఈ ర్యాషెస్‌ కొన్నిసార్లు అలాగే ఉండిపోతాయి. ఇప్పటికీ కొందరు అమ్మాయిలు, మహిళలు బహిష్టు సమయంలో సంప్రదాయ శానిటరీ ప్యాడ్స్‌ ఉపయోగిస్తారు. అయితే వాటిలో హానికర రసాయనాలతో పాటు ప్లాస్టిక్‌ ఎక్కువ ఉంటుంది. వాటి పీల్చుకునే సామర్థ్యం కూడా   తక్కువే. ఈ రసాయనాలను తడిదనం ఉన్న చర్మం గ్రహించినప్పుడు   చర్మం రంగు మారుతుంది. నల్లటి మచ్చలు ఏర్పడతాయి. శాశ్వతంగా ఉండిపోయే నల్లటి మచ్చలు ఎంతో ఇబ్బందికి గురిచేస్తాయి. దాదాపు నలభై ఏళ్లుగా శానిటరీ ప్యాడ్స్‌ వాడుతున్న మహిళల మీద వాటి ప్రభావం ఎంతగా ఉంటుందో ఊహించండి. 


దురదృష్టం ఏమంటే ఈ సమస్య గురించి ఆర్టికల్స్‌, వార్తల్లో రావడం చాలా తక్కువ. ఈ సమస్యను అందరి దృష్టికి తేవాల్సిన సమయం వచ్చిందని నేను అనుకుంటున్నా. బహిరంగంగా మాట్లాడమే కాదు ఈ ఇబ్బందిని అధిగమించే మార్గాలను కూడా అన్వేషించాలి. హానికర రసాయనాలు లేని ప్యాడ్‌ అయితే ఎక్కువ సేపు పొడిగా ఉంటుంది. చర్మానికీ, పర్యావరణానికీ హాని చేయదు. ర్యాషెస్‌ అనేవి పీరియడ్‌ సమయంలో ఎదురయ్యే సాధారణ సమస్సే కావచ్చు. కానీ మనం దానిని ఏమంత ప్రాధాన్యం లేనిదిగా భావించి పరిష్కారం కనుక్కోవడమే మరచిపోయాం. సమస్యను అలా వదిలేయవద్దు. అలానే మీ గురించి మీరు పట్టింపులేనట్టుగా ఉండొద్దు’’. 

Updated Date - 2021-03-07T05:30:00+05:30 IST