Abn logo
Aug 11 2020 @ 19:42PM

రియాకు సపోర్ట్ చేస్తూ నటి ట్వీట్.. ఆడుకుంటున్న నెటిజన్లు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యా? లేక హత్యా?.. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆయనది ఆత్మహత్య అని అనిపించడం లేదు. ఆయన మృతి వెనుక చాలా బలమైన కారణం ఉన్నట్లుగా తెలుస్తుంది. లేదంటే ముంబై పోలీసులు వల్ల కాదని, బీహార్ పోలీసులు ఈ కేసును తీసుకోవడం, ఆ తర్వాత సీబీఐ ఎంక్వైరీ.. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. చివరికి ఈ మృతి విషయం ఎక్కడ ఆగుతుందో తెలియదు కానీ.. రోజు రోజుకీ మిస్టరీగా మాత్రం మారుతుంది. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా అనుమానం వ్యక్తం అవుతున్న రియాను సీబీఐ ఎంక్వైరీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బాలీవుడ్ నటి ఒకరు ఆమెకు సపోర్ట్‌గా మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో కావాలనే రియాను కొందరు ఇరికిస్తున్నారని, దీనిపై న్యాయస్థానమే తుది నిర్ణయం చెబుతుంది అంటూ ఆమె తన ట్వీట్‌లో పేర్కొంది. ఇక అంతే.. మొదటి నుంచి సుశాంత్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్న నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెతో ఆడుకుంటున్నారు. ఈ కేసు విషయంలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. అసలు ఈ కేసు ఇంత దూరం రావడానికి కారణం కూడా సుశాంత్ అభిమానులు, నెటిజన్లే అని చెప్పవచ్చు. మొన్నటి వరకు బాలీవుడ్ నెపోటిజంపై విరుచుకుపడిన నెటిజన్లు.. ఇప్పుడు సుశాంత్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. అస్సలు ఊరుకోవడం లేదు. ఇప్పుడు స్వర భాస్కర్‌పై కూడా నెటిజన్లు పదునైన విమర్శలతో రెచ్చిపోతున్నారు. 


Advertisement
Advertisement
Advertisement