Oct 13 2021 @ 20:01PM

సవాళ్ళను ఎదుర్కొంటేనే..: స్నేహ

కోలీవుడ్‌లోని సీనియర్‌ నటీమణి స్నేహ.. నటుడు ప్రసన్నను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లి కావడంతో సినిమాలు తగ్గించుకుంది. అయినా ఆమె వద్దకు వచ్చే పాత్రల్లో మంచివాటిని ఎంపిక చేసుకుని నటిస్తూనే ఉంది. అందుకోసం ఆమె తన శరీర బరువును కూడా తగ్గించి మరింత స్లిమ్‌గా తయారవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా మోడరన్‌ దుస్తులతో ఒక స్పెషల్‌ ఫొటో షూట్‌ చేసి వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఆ ఫోటోల కింద... సవాళ్ళను ఎదుర్కొంటేనే మార్పు చూడొచ్చు అంటూ క్యాప్షన్‌ పెట్టింది. ప్రస్తుతం స్నేహ కొత్త ఫొటోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.


Otherwoodsమరిన్ని...