Abn logo
Jun 2 2020 @ 22:56PM

‘పుష్ప’లో విల‌న్‌గా రోజా.. నిజమేనా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్‌లో.. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త‌ నిర్మాణంలో రూపొందుతున్న‌ క్రేజీ ప్యాన్ ఇండియా మూవీ ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ‘అల‌ వైకుంఠపురములో’ వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌రువాత అల్లు అర్జున్ చేస్తున్న మూవీ కావ‌డంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్ష‌కుల్లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ ప్రాజెక్ట్ టైటిల్‌ని, అల్లు అర్జున్‌ లుక్‌ని విడుదల చేశారు ద‌ర్శ‌కనిర్మాత‌లు. ఈ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ఈ సినిమాలో నటించే వారి విషయంలో రోజుకొక పేరు వినిపిస్తూ.. ఈ చిత్రం నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. యాంకర్ సుమ ఈ చిత్రంలో బన్నీకి అక్కగా చేస్తుందనే వార్తలు వచ్చాయి. సంజయ్ దత్ విలన్ అంటూ వార్తలు వచ్చాయి. ఇలా ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో లేడీ విలన్ అంటూ మరొక వార్త పుట్టుకొచ్చింది. 


ఆ లేడీ విలన్ ఎవరో కాదు.. నటి, రాజకీయ నాయకురాలు రోజా. అవును ఈ సినిమాలో రోజా విలన్‌గా చేస్తుందట. చిత్రకథలో తన పాత్రకు చాలా గుర్తింపు ఉండటంతో.. వెంటనే రోజా అంగీకరించిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది. సుకుమార్ సినిమాలో పాత్రలు ఎలా ఉంటాయో తెలియంది కాదు. ఇందులో విలన్ పాత్రకు సుకుమార్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారని, అందుకే రోజా వెండితెరపై రీ ఎంట్రీకి ఓకే చెప్పిందని అంటున్నారు. అయితే చిత్రయూనిట్ నుంచి ఇప్పటి వరకు ఈ విషయంపై ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.

Advertisement
Advertisement
Advertisement