Abn logo
Nov 28 2020 @ 19:28PM

‘మాస్టర్’ ఓటీటీలోనా?.. రాధిక ట్వీట్‌తో విజయ్‌ ఫ్యాన్స్‌లో గుబులు

'ఖైదీ' దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో.. స్టార్‌ హీరో విజయ్‌ నటించిన చిత్రం 'మాస్టర్‌'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. థియేటర్స్‌లో 100 శాతం ప్రేక్షకులు వచ్చే క్షణాల కోసం ఎదురుచూస్తోంది. మధ్యలో ఓటీటీలో విడుదల అనే వార్తలు వచ్చినా ఖండిస్తూ.. థియేటర్స్‌లోనే సినిమా రిలీజ్‌ అనేలా చిత్రయూనిట్‌ ఖరాఖండీగా చెప్పేసింది. అయితే నటి రాధిక శరత్‌కుమార్‌ తాజాగా చేసిన ట్వీట్‌తో.. ఇప్పుడు విజయ్‌ అభిమానులలో గుబులు మొదలైంది. ఇంతకీ రాధిక ఏం ట్వీట్‌ చేశారని అనుకుంటున్నారా?


''మాస్టర్‌ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతుందా? న్యూస్‌ పేపర్‌లో చదివాను. నా వరకు నేనైతే.. ఈ సినిమాని థియేటర్‌లోనే చూడాలని అనుకుంటున్నాను.. మరి మీరు? " అని రాధిక ట్వీట్‌ చేసింది. దీంతో విజయ్‌ అభిమానుల్లో నిరుత్సాహం నెలకొంది. ఈ సినిమా థియేటర్‌లోనే చూడాలని వారు మొదటి నుంచి కోరుకుంటున్న విషయం తెలిసిందే.


Advertisement
Advertisement
Advertisement