Abn logo
Jul 13 2020 @ 06:12AM

మ‌రో నటికి క‌రోనా పాజిటివ్

కరోనా వైర‌స్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. బాలీవుడ్ న‌టులు అమితాబ్ బచ్చన్, అభిషేక్, ఐశ్వర్య, వారి కుమార్తె ఆరాధ్య క‌రోనా బారిన ప‌డిన‌ట్లు తేలింది. తాజాగా బాలీవుడ్ నటి రాచెల్ వైట్ కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కోల్‌కతాలో ఉన్న ఆమె ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియ‌జేశారు. త‌న‌ ఆరోగ్యం మెరుగుప‌డాల‌ని అభిమానులు ప్రార్థ‌న‌లు చేయాల‌ని ఆమె కోరారు. కాగా రాచెల్ న‌టులు కంగనా రనౌత్, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రల్లో నటించిన ఉంగ్లీ చిత్రంలో న‌టించారు. అలాగే బెంగాలీ చిత్రం హర్ హర్ బ్యోమ్‌కేష్‌లో కూడా న‌టించారు. 
Advertisement
Advertisement
Advertisement