హీరోయిన్స్ రెగ్యులర్ కమర్షియల్ పాత్రలు చేయటం గొప్పేం కాదు. కాస్త అందంగా కనిపించి, నాలుగు పాటల్లో సందడి చేస్తే సినిమా పూర్తైపోతుంది. కానీ, కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మూవీ ట్రై చేస్తే బాగా కష్టపడాల్సిందే. బీ-టౌన్ బ్యూటీ నుస్రత్ బరూచా కూడా అదే చేసింది. తన అప్‌కమింగ్ మూవీ కోసం 25 రోజుల ముందుగానే ప్రెగ్నెంట్ అయిపోయింది!
‘చోరీ’ అనే హారర్ సినిమాలో నుస్రత్ కాబోయే తల్లిగా కనిపించనుంది. ఆమె సినిమాలో చాలా సేపు గర్భవతిగానే ఉంటుంది. అందుకే, తన పాత్రకి సంపూర్ణ న్యాయం చేయటం కోసం షూటింగ్ మొదలు కాక ముందే ప్రెగ్నెంట్ మూడ్‌లోకి వెళ్లిపోయిందట! పాతిక రోజుల ముందుగానే ఫిల్మ్ మేకర్స్‌కి చెప్పి ‘ప్రెగ్నెంట్ బాడీసూట్’ తెప్పించుకుందట. అసలు పిక్చరైజేషన్ స్టార్ట్ కావటానికి ముందు 25 రోజులు ఆ బాడీసూట్ ధరించి, కడుపులో బిడ్డ ఉంటే ఎలా ఉంటుందో, అనుభూతి చెందిందట. అలా పూర్తిగా ప్రెగ్నెన్సీ అలవాటయ్యాక సెట్ మీద కాలుమోపానని నుస్రత్ బరూచా చెప్పుకొచ్చింది...