మేకప్ కలెక్షన్ కోసం ‘రక్తం’లో నగ్నంగా కైలీ జెన్నర్.. తట్టుకోలేకపోతున్న అభిమానులు

ABN , First Publish Date - 2021-10-13T02:54:29+05:30 IST

అమెరికన్ రియాలిటీ టీవీ నటి, మోడల్, మహిళా వ్యాపారవేత్త కైలీ జెన్సర్ ఓ మేకప్ కలెక్షన్ కోసం ఇచ్చిన పోజులు

మేకప్ కలెక్షన్ కోసం ‘రక్తం’లో నగ్నంగా కైలీ జెన్నర్.. తట్టుకోలేకపోతున్న అభిమానులు

లాస్‌ఏంజెలెస్: అమెరికన్ రియాలిటీ టీవీ నటి, మోడల్, మహిళా వ్యాపారవేత్త కైలీ జెన్సర్ ఓ మేకప్ కలెక్షన్ కోసం ఇచ్చిన పోజులు చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఆ స్టిల్స్ మరీ దారుణంగా ఉన్నాయని, తట్టుకోవడం తమ వల్ల కావడం లేదని కామెంట్ చేస్తున్నారు. త్వరలో మార్కెట్లోకి రాబోయే మేకప్ కలెక్షన్ కోసం 24 ఏళ్ల జెన్నెర్ నగ్నంగా నటించింది.


నకిలీ రక్తంలో తడిసి ముద్దవుతున్నట్టు ఉన్న ఫొటోలు, వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అవి ఒక్కసారిగా వైరల్ అయి సోషల్ మీడియాను చుట్టేశాయి. ఆ స్టిల్స్ చూసిన నెటిజన్లు ఇది సరికాదంటూ కామెంట్ చేస్తున్నారు. అందులోనూ గర్భవతిగా ఉండి కలవరపెట్టడం ఏమీ బాగోలేదని, ఇది మంచి ఐడియా కానేకాదంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. 


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2021-10-13T02:54:29+05:30 IST