ఆ సమయంలో నేను మంత్రాలు జపిస్తుంటే.. Shah Rukh Khan మాత్రం అరుస్తుంటాడు: జుహీ చావ్లా

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, సీనియర్ నటి జుహీ చావ్లా ఐపీఎల్‌లోని టీం కోల్‌కత్తా నైట్ రైడర్స్ పార్ట్‌నర్స్ అనే విషయం తెలిసిందే. ఆట అన్న తర్వాత జట్లు గెలవడం, ఓడిపోవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఒక్కొక్కరూ ఒక్కల స్పందిస్తారు. కేకేఆర్ ఓడిపోయే దశలో ఉన్నప్పుడు తను ఎలా ఉంటుంది.. కింగ్ ఖాన్ ఎలా బిహేవ్ చేస్తాడని ఆసక్తికర అంశాల గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది జుహీ.


‘కేకేఆర్ ఓడిపోయే దశలో ఉంటే నేను గాయత్రి మాత, శివ నుంచి హనుమాన్ వరకూ అందరిని స్మరించుకుంటూ, మంత్రాలు జపిస్తూ, పూజ చేస్తుంటా. అయితే ఆ పరిస్థితుల్లో మా ఆటగాళ్ల గురించి అరుస్తూ ఉంటాడు. బౌలింగ్ అలా చేయకూడదు. ఇలా చేయాలి. ఇది సరైంది కాదు. టీంని మీటింగ్‌కి పిలవాలని కోపంగా మాట్లాడుతుంటాడు. ఆ సమయంలో ఏం మాట్లాడాలో అర్థం కాక నిలబడి చూస్తుంటాన’ని చెప్పింది.


అంతేకాకుండా..‘ఒకవేళ కేకేఆర్ గనుక మ్యాచ్ ఓడిపోతే మాత్రం మీటింగ్ పిలిచేవాడు. నేను ఇప్పుడేం జరుగుతుందోనని భయపడుతూ వెళతా. కానీ అక్కడ షారుక్ జోకులు వేస్తూ, ఫన్నీ విషయాలు మాట్లాడుతూ.. నవ్విస్తూ ఉంటాడు. కానీ మీటింగ్ చివరిలో మాత్రం బాగా ఆడండని చెప్పి ముగించేస్తాడ’ని తెలిపింది.


కాగా ఈ సంవత్సరం ఐపీఎల్ వేలం కోసం షారుక్ కొడుకు ఆర్యన్, జుహీ చావ్లా కూతురు జాన్వీ మెహతా హాజరయ్యారు. దీని గురించి తెలుపుతూ ‘వేలం వద్ద కేకేఆర్ కిడ్స్ ఇద్దరినీ చూడడం ఎంతో హ్యాపీగా ఉందం’టూ జుహీ సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా తన సంతోషాన్ని పంచుకుంది.

Advertisement

Bollywoodమరిన్ని...