Abn logo
Jul 13 2020 @ 05:42AM

సినీనటి, మోడల్ కేన్సర్‌తో కన్నుమూత

సోషల్ మీడియాలో వీడ్కోలు

ముంబై : ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి దివ్య చౌక్సే కేన్సరుతో కన్నుమూశారు. ‘హై అప్పా దిల్ తోహ్ అవారా’ చిత్రంలో నటించిన దివ్య చౌక్సే సుదీర్ఘకాలం కేన్సరుపై పోరాడుతూ మృతి చెందారు. దివ్య చౌక్సే మృతిపై ఆమె సమీప బంధువు సౌమ్యా అమిష్ వర్మ సంతాప సందేశం ద్వారా ధ్రువీకరించారు. దివ్య మృతిపై సినీనటుడు సాహిల్ ఆనంద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సంతాప సందేశం పెట్టారు.‘‘ మీ అభిరుచి, కల, సినీపరిశ్రమ పట్ల మీ సానుకూలత మీ అన్నయ్యనైన నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి... మీ ఆత్మకు శాంతి చేకూరుగాక, మీ జ్ఞాపకాలు నా హృదయంలో సజీవంగా ఉంటారు’’ అని సాహిల్ తన సంతాపసందేశంలో రాశారు.దివ్య చౌక్సే మరణానికి కొన్ని గంటల ముందు తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం హృదయ విదారక పోస్టు పెట్టారు. ‘‘కేన్సరుతో నేను నెలల తరబడిగా మరణ మంచం మీద ఉన్నాను...దివ్య చౌక్సే బై ’’ అంటూ రాశారు. దివ్య చౌక్సే పలు యాడ్ ఫిల్మ్స్, టెలివిజన్ షోలలో కనిపించారు.

Advertisement
Advertisement
Advertisement