Disha Patani: ఈ బ్యూటీలో ఏదో తేడా కనిపిస్తోంది.. దిశా పటానీ వైరల్ వీడియోపై ట్రోలింగ్

బాలీవుడ్ హట్‌ బ్యూటీస్‌‌లో దిశ పటానీ ఒకరని అందరూ ఒప్పుకొని తీరాల్సిన విషయం. ఆడవాళ్లు అసూయపడే శరీరం, అందమైన డ్యాన్స మూవ్స్, కిల్లర్ లుక్స్‌తో కుర్రాళ్ల గుండెలను కొల్లగొడుతూ ఉంటుంది. ఫ్యాషన్ అంటే ఇష్టపడేవారిని ప్రతి ఈవెంట్‌లో ఆమె వేసుకునే డ్రెస్‌లు ఆకట్టుకుంటూ ఉంటాయి.


తాజాగా దిశా తన ‘రాధే’ మూవీ కో స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’ స్క్రీనింగ్‌లో పాల్గొంది. దీని సంబంధించిన వీడియోని సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో ఎల్లో క్రాప్ టాప్, డెనిమ్ బాటమ్‌తో ఎంతో అందంగా ఉంది ఈ భామ. సాధారణంగా అయితే ఈ బ్యూటీకి సంబంధించిన ఏ వీడియో అయిన బయటికి వచ్చిన కొద్దిసేపటికే తన అందంతో అభిమానుల కళ్లను కట్టిపడేస్తుంటుంది. కానీ ఈ సారి మాత్రం అలా జరగలేదు.

తాజాగా వైరల్ అయిన దిశా వీడియోని చూసిన నెటిజన్లు తనలో ఎదో తేడా కనిపిస్తోందని ట్రోలింగ్ చేస్తున్నారు.  కొందరు ‘దిశ కొంచెం డిఫరెంట్‌గా ఉందని’ కామెంట్స్ పెడుతుండగా.. ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందని మరికొందరు అంటున్నారు. అలాగే ముక్కుకి ఎదో సర్జరీ చేసుకుందని ఇంకొందరు.. పెదవుల్లో ఎదో మెడిసిన్ ఉందని కామెంట్స్‌తో ముంచేస్తున్నారు.


Advertisement