Jul 24 2021 @ 08:36AM

రూ.10 కోట్ల నష్టపరిహారం కోరిన నటి..షాక్‌లో మాజీమంత్రి

తనకి రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని తమిళ నటి చాందిని కోరారు. దీంతో అన్నాడీఎంకే మాజీమంత్రి మణికంఠన్‌ షాక్‌కి గురయినట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అన్నాడీఎంకే మాజీమంత్రి మణికంఠన్‌ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, సహజీవనం చేసి మోసం చేశారని నటి చాందిని పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాంతో పోలీసులు ఆయనను అరెస్టు కూడా చేశారు. ప్రస్తుతం ఈ కేసు చెన్నై హైకోర్టు విచారణలో ఉండగా.. చాందిని గురువారం స్థానిక సైదాపేట కోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిలో ఆమె, మాజీమంత్రి మణికంఠన్‌ తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు. అంతేకాదు తాను చెన్నైలో ఉండి కోర్టు కేసు వ్యవహారాలను చూసుకోవాల్సి ఉండడంతో.. అందుకుగాను తనకు అయ్యే నెలవారి ఖర్చులు కూడా ఆయనే చెల్లించాలని తాజా పిటిషన్‌లో కోరారు. ఇక ఈ పిటిషన్‌ వచ్చే నెల 5న కోర్టు విచారణ చేపట్టనుందని తెలుస్తోంది. 

Otherwoodsమరిన్ని...