మలయాళ నటి, అసిస్టెంట్ డైరెక్టర్ అంబికా రావు (Ambika rao)(58) గుండెపోటుతో మరణించారు. కొన్ని నెలలుగా ఎర్నాకులంలోని ఓ ప్రైవేట్ కరోనా చికిత్స తీసుకుంటున్న ఆమె సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆమె త్రిస్సూర్‌లో నివశిస్తున్నారు. అంబికా రావుకు రాహుల్, సోహన్ ఇద్దరు కుమారులున్నారు. Mollywood actress Ambika Passed away
2002లో బాలచంద్ర మీనన్ దర్శకత్వం వహించిన ‘కృష్ణ గోపాలకృష్ణ’ సినిమాతో సహాయ దర్శకురాలిగా మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. తొమ్మనుమ్ మక్కలుమ్, సాల్ట్ అండ్ పెప్పర్, వెల్లి నక్షత్రం, రాజమాణికం సినిమాలకు సహాయదర్శకురాలిగా పనిచేశారు. తర్వాత నటిగా పలు చిత్రాల్లో నటించారు. కుంబళంగి నైట్స్, వైరస్ చిత్రాలు ఎంతగానో గుర్తింపు తీసుకొచ్చాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కడువా’ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అంబికా రావు మృతిపట్ల మలయాళ సినీ ఇండస్ర్టీ దిగ్ర్భాంతికి లోనైంది. పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. (Kaduva actress)