ఇంకా ముంబైలోనే Alia Bhatt.. కత్రినా భర్తను లాగేసుకోవద్దంటూ ట్రోలింగ్

బాలీవుడ్‌లో అందాల తార అలియా భట్‌కి ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. నటనతోనే కాకుండా తన ఫ్యాషన్‌ సెన్స్‌తోనూ అభిమానుల హ‌ృదయాలను కొల్లగొడుతూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీకి ముంబైలోని ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనికి ‘ఇంకా ముంబైలోనే అలియాభట్’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు వైరల్ భయానీ. దీంతో విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లు. ఎందుకు అనుకుంటున్నారా?..


కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ రాజస్థాన్‌లోని ఓ కోటలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే అలియా బాయ్‌ఫ్రెండ్ రణ్‌బీర్‌కి క్యాట్ మాజీ ప్రియురాలు.. అంతేకాకుండా విక్కీతో కలిసి సినిమా కూడా చేసింది. దీంతో వారి మ్యారేజ్‌కి వెళ్లకుండా ఇంకా ముంబైలో ఏం చేస్తుందని ట్రోల్ చేశారు నెటిజన్లు.


‘ఆమెకి ఆహ్వాన పత్రిక దొరకలేదనుకుంటా’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఆమెని పెళ్లికి పిలవలేదేమో?’ అని మరొకరు.. ‘తన బాయ్‌ఫ్రెండ్ స్నేహితురాలి పెళ్లికి అలియా వెళ్లడం లేదా?’ అని ఇంకొకరు.. ‘ఇంతకుముందు అలియా ఆమె బాయ్‌ఫ్రెండ్‌ని దొంగిలించింది.. ఇప్పుడు భర్తని కూడా దొంగిలించకూడద’ని కొందరు ట్రోల్ చేశారు.Advertisement

Bollywoodమరిన్ని...