Abn logo
Jul 15 2020 @ 23:15PM

నటులకే కరోనా ప్రమాదం ఎక్కువ: బిపాసా

ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నటులకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని బాలీవుడ్ తార బిపాసా బసు చెప్పింది. తాజాగా ‘కసౌతీ జిందగీ కే’ చిత్రంలో నటిస్తున్న పార్థ్ సంథాన్‌కు కరోనా సోకింది. దీనిపై స్పందిస్తూనే ఇన్‌‌స్టాగ్రామ్ వేదికగా బిపాసా పైవ్యాఖ్యలు చేసింది. ‘షూటింగుల్లో ప్రతి ఒక్కరూ పీపీఈ కిట్లు, గ్లవ్స్, మాస్కులు, షీల్డులు ధరిస్తున్నారు. కానీ నటులకు అలా చేయడం కుదరదు. వాళ్లు ఎటువంటి రక్షణా లేకుండానే నటించాల్సి ఉంటుంది. ఈ కారణంగానే నటులకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది’ అని బిపాసా తెలిపింది. అందుకే పరిస్థితి కొంచెం చక్కబడే వరకూ కుదిరితే షూటింగులన్నీ ఆపేయాలని చెప్పింది.

Advertisement
Advertisement
Advertisement