ఆలియాని చూసిన ఆ అమ్మాయి ఎందుకు ఏడ్చిందంటే...

ఆలియా భట్ ప్రస్తుతం ఢిల్లీలో ఉంది. ఆమె రణవీర్‌తో కలసి గత కొన్ని రోజులుగా ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. అయితే, రెగ్యులర్ షూట్ నుంచీ కాస్త బ్రేక్ తీసుకున్న ఆలియా, రణవీర్ ఓ మ్యూజిక్ షోకి వెళ్లారు. పాప్ సింగర్ ఏపీ దిల్లన్ నిర్వహించిన కచేరికి ప్రత్యేకంగా హాజరయ్యారు వారిద్దరు. ఇప్పటికే అక్కడ ఆలియా హంగామా కొన్ని వీడియోల రూపంలో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. హుషారైన సంగీతానికి ఆమె ఊగిపోతూ కనిపించింది!


ఢిల్లీ మ్యూజిక్ షోలో ఆలియాకు తన డై హార్డ్ ఫ్యాన్ ఒకరు ఎదురయ్యారు. జనంలో కొంచెం దూరంగా నిలబడిన ఒక అమ్మాయి మొదట చేతులు ఊపుతూ బాలీవుడ్ స్టార్‌ని పలకరించింది. ఆలియా కూడా చేతులు పైకెత్తి వేవ్ చేస్తూ... కొన్ని ఫ్లైయింగ్ కిస్సులు కూడా ఆ అమ్మాయికి విసిరింది! లవ్ సింబల్‌ని చేతులతో చూపించింది! తన ఫేవరెట్ హీరోయిన్ స్పందనకి మురిసిపోయిన ఫ్యాన్ గాళ్... 2014లో... తాను ఆలియాని కలసినట్టుగా చెప్పింది. ఇద్దరి మధ్యా కాస్త దూరం ఉన్నప్పటికీ ఆలియా భట్ ఆమె చెప్పింది అర్థం చేసుకుని... ‘‘నాకు నీ ముఖం ఇంకా జ్ఞాపకం ఉందం’’టూ జవాచ్చింది! ఆలియా అలా అనేసరికి ఎమోషనల్ అయిపోయిన సదరు అభిమాని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. వీడియోలో ఆమె కనిపించనప్పటికీ, ఆలియా భట్, తనని ఏడవద్దని చెప్పటం, సైగలు చేయటం నెటిజన్స్‌కి కనిపించింది! బాలీవుడ్ స్టార్ బ్యూటీ వ్యవహరించిన తీరుకి చాలా మంది ఫిదా అయిపోతున్నారు...   


Advertisement