Abn logo
Dec 4 2020 @ 22:08PM

‘అఘోరా’ పాత్రలో విష్వక్సేన్

హీరో విష్వక్సేన్‌ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే  'ఫలక్ నుమా దాస్', 'హిట్' చిత్రాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించిన విష్వక్సేన్.. ఇప్పుడు వరుస సినిమాలతో దూకుడుమీదున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'పాగల్' చిత్రం సెట్స్‌పై ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో పాటు తమిళ చిత్రం 'ఓ మై కడవులే', మలయాళ చిత్రం 'కప్పెల' రీమేక్‌లో కూడా విష్వక్సేన్‌ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. మరి ఈ రెండు చిత్రాలే కాకుండా త్వరలోనే మరో చిత్రం ఆయన ప్రకటించనున్నారని టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తుంది. ఈ చిత్రంలో విష్వక్సేన్‌ 'అఘోరా' పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ఎటువంటి న్యూస్‌ రాలేదు. త్వరలోనే ఈ పాత్రకి సంబంధించిన చిత్ర ప్రకటన రానుందని అంటున్నారు.

Advertisement
Advertisement
Advertisement