Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 11 Aug 2022 13:36:24 IST

Vishal Injured: షూటింగ్‌లో హీరో విశాల్‌కి తీవ్రగాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్..

twitter-iconwatsapp-iconfb-icon

సినిమా బాగా రావడానికి ఎంతైనా కష్టపడే హీరోల్లో తమిళ నటుడు విశాల్ (Vishal) కూడా ఒకరు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌(Action Scenes)ని రియలిస్టిక్‌గా తీయడానికి చాలా రిస్క్ తీసుకుంటూ ఉంటాడు. ఆ సందర్భంలో పలుమార్లు గాయాలు పాలయ్యాడు. ఇంతకుముందు విశాల్ నటించిన మూవీ ‘లాఠీ’. ఆ సినిమా షూటింగ్‌లో ఓ యాక్షన్ సీన్‌లో విశాల్‌కి స్వల్ప గాయాలయ్యాయి. కానీ.. గాయాలు మరి పెద్దవి కాకపోవడంతో మరుసటి రోజే షూటింగ్ వెళ్లాడు. 


తాజాగా సైతం విశాల్‌ షూటింగ్‌లో మరోసారి గాయపడ్డాడు. ఈ యువ నటుడు తాజాగా ‘మార్క్ ఆంటోనీ’ అనే మూవీ చేస్తున్నాడు. హై యాక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో భాగంగా మేకర్స్ ఓ భారీ యాక్షన్ సీన్‌ని తెరకెక్కిస్తున్నారు. ఆ సమయంలోనే విశాల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో మార్క్‌ ఆంటోనీ షూటింగ్‌ని వెంటనే నిలిపివేశారు. గాయపడ్డ విశాల్‌కు చికిత్స అందించారు. అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో షూటింగ్‌ నుంచి విశాల్‌ వెళ్లిపోయాడట. కొద్దిరోజుల పాటు ఆయనకు విశ్రాంతి అవసరమని తెలుస్తోంది. కాగా.. విశాల్‌కి గాయాల అయిన విషయం సోషల్‌ మీడియా వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తమ హీరో త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement