ఎస్వీఆర్ జీవిత చరిత్ర పోస్టర్లను ఆవిష్కరిస్తున్న దృశ్యం
ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే కన్నబాబు
సర్పవరం జంక్షన్, జూలై 3: సినీరంగంలో తన నటనా చాతుర్యంతో అశేష ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలిచిన ఎస్వీ రంగారావు దేశం గర్వించదగ్గ విశ్వనట చక్రవర్తి అని కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. నాగమల్లితోట సమీపంలోని ఎస్వీ రం గారావు జంక్షన్ వద్ద ఎస్వీఆర్ స్మారక కళావేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఆయన 104వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు వారి గొప్పతనాన్ని చాటి చెప్పిన రంగారావు జిల్లా వాసి కావ డం గర్వకారణమన్నారు. రంగారావు జీవిత చరిత్రకు సంబంధించిన పోస్టర్ల్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్‌పర్సన్ పెదపాటి అమ్మాజీ, సినీ డైరెక్టర్ కురసాల కల్యాణ్‌కృష్ణ, ఎస్వీఆర్ స్మారక కళావేదిక అధ్యక్షులు బసవా ప్రభాకరరావు, జడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు, వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి, జంగా గగారిన్, బెజవాడ సత్యనారాయణ, రాం దేవు చిన్న, ఐ.శ్రీను, కర్రి చక్రధర్ రంగారావు పాల్గొన్నారు.