సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి

ABN , First Publish Date - 2021-11-29T05:58:59+05:30 IST

భానుగుడి (కాకినాడ), నవంబరు 28: ప్రస్తుతకాలంలో సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవడం వల్ల కరోనా వంటి విపత్కర పరిస్థితుల నుంచి పేదల ప్రాణాలు కాపాడుకోవచ్చని సినీ నటుడు శుభలేఖ సుధాకర్‌ అన్నారు. రామారావుపేటలోని లయన్స్‌ క్లబ్‌ అంతర్జాతీయ సమైక్య-2 జిల్లా గవర్నర్‌ ద్వితీయ జోన్‌ ఎడ్వయిజరీ సమావేశం ఆదివారం జోన్‌ చైర్‌పర్సన్‌ కరుటూరి శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించా

సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి
దంటు కళాక్షేత్రంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న శుభలేఖ సుధాకర్‌

భానుగుడి (కాకినాడ), నవంబరు 28: ప్రస్తుతకాలంలో సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవడం వల్ల కరోనా వంటి విపత్కర పరిస్థితుల నుంచి పేదల ప్రాణాలు కాపాడుకోవచ్చని సినీ నటుడు శుభలేఖ సుధాకర్‌ అన్నారు. రామారావుపేటలోని లయన్స్‌ క్లబ్‌ అంతర్జాతీయ సమైక్య-2 జిల్లా గవర్నర్‌ ద్వితీయ జోన్‌ ఎడ్వయిజరీ సమావేశం ఆదివారం జోన్‌ చైర్‌పర్సన్‌ కరుటూరి శ్రీనివాస్‌ అధ్యక్షతన  నిర్వహించారు. అధ్యక్షుడు ఎం.వెంకటరమణ, సెక్రటరీ పి.వెంకటసుబ్బారావు, కోశాధికారి సత్యనారాయణతో పాటు డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.  విశిష్ట అతిథులుగా సినీ నటుడు శుభలేఖ సుధాకర్‌, నటుడు షఫీ, బట్టల రామస్వామి, హీరో అల్తాఫ్‌, దర్శకుడు ఇంద్రకంటి కిరణ్మయి మాట్లాడారు. కరోనా సమయంలో లయన్స్‌ చేసిన సేవలు మెచ్చుకుని తీరాల్సిందేనని, విద్యార్థులకు చిన్నప్పటి నుంచి చదువుతో పాటు సమాజసేవ చేసేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. 


 ‘రాళ్ళల్లో నీరు’ ప్రదర్శన

కాకినాడ దంటు కళాక్షేత్రంలో రాళ్ళల్లో నీరు సినిమా ప్రదర్శన నిర్వహించారు. శ్రీమూర్తి కల్చరల్‌ అసోసియేషన్‌ 28వ వార్షికోత్సవం సందర్భంగా అధ్యక్షుడు సీఎ్‌సప్రసాద్‌ నిర్వహించిన కార్యక్రమంలో సినీనటులు శుభలేఖ సుధాకర్‌, సఫీ, దర్శకుడు ఇంద్రగంటి కిరణ్మయి పాల్గొన్నారు. సుధాకర్‌ మాట్లాడుతూ రాళ్ళల్లో నీరు ఇప్పటికే 9 ఇంటర్నేషనల్‌ అవార్డులు సాధించిందని, త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. మహిళల గౌరవాన్ని నిలబెట్టగల సినిమాకు ఇంద్రగంటి దర్శకత్వం వహించడం ఆనందంగా ఉందన్నారు. సఫీ మాట్లాడుతూ ఈ సినిమాలో మంచి పాత్ర పోషించడం సంతృప్తినిచ్చిందన్నారు. 



నేడు యథావిఽథిగా ‘స్పందన’

కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ 

కార్పొరేషన్‌ (కాకినాడ), నవంబరు 28: కార్పొరేషన్‌ కార్యాలయంలో సోమవారం యథావిథిగా స్పందన కార్యక్రమం జరుగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ ప్రాంతాల్లో సమస్యలేమైనా ఉంటే సమీప సచివాలయం, కార్పొరేషన్‌ కార్యాలయంలో కానీ అందజేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 



Updated Date - 2021-11-29T05:58:59+05:30 IST