మరో చిన్నారి జీవితం కాపాడిన సోనూ సూద్

ABN , First Publish Date - 2022-05-29T09:24:37+05:30 IST

నటుడు సోనూ సూద్ మరోసారి తనలోని దాతృత్వ గుణాన్ని చాటుకున్నాడు. ఇటీవలే ఒక కాలులేని పేద విద్యార్థిని ఇంటి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశాల చేరుకోవడానికి పడుతున్న కష్టాలు చూసిన సోను.. ఆమెకు ఒక కృత్రిమ కాలుని అందించాడు..

మరో చిన్నారి జీవితం కాపాడిన సోనూ సూద్

నటుడు సోనూ సూద్ మరోసారి తనలోని దాతృత్వ గుణాన్ని చాటుకున్నాడు. ఇటీవలే ఒక కాలులేని పేద విద్యార్థిని ఇంటి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశాల చేరుకోవడానికి పడుతున్న కష్టాలు చూసిన సోను.. ఆమెకు ఒక కృత్రిమ కాలుని అందించాడు. 


ఇప్పుడు ఒక రెండున్నర్రేళ్ల చిన్నారికి పుట్టుకతో నాలుగు చేతులు, కాళ్లు ఉండగా.. ఆ పాప తల్లిదండ్రులు పేదవారని గమనించిన సోను వారికి అండగా నిలిచాడు. ఆ పాపకు ఆపరేషన్ చేసేందుకు ఆర్థిక సహాయం అందించి మరోసారి మానవత్వాన్ని చూపాడు. ఆ చిన్నారికి ఆపరేషన్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "పాపకు చికిత్స మొదలైంది.. ఆమె కోసం అందరూ ప్రార్థించండి" అని ట్వీట్ చేశాడు.


కరోనా కారణంగా లాక్‌డౌన్ సమయంలో సోనూ వందల మంది పేద వలస కూలీలకు సహాయం అందించిన విషయం విదితమే.


Updated Date - 2022-05-29T09:24:37+05:30 IST