Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 27 May 2022 20:41:13 IST

తిక్కగా మాట్లాడిన నెటిజన్... ‘నేను లక్కీ’ అంటూ షాకిచ్చిన Samantha

twitter-iconwatsapp-iconfb-icon
తిక్కగా మాట్లాడిన నెటిజన్... నేను లక్కీ అంటూ షాకిచ్చిన Samantha

సినిమా సెలబ్రిటీలకు సొషల్ మీడియాలో ట్రోలింగ్ కొత్తేం కాదు. అందులోనూ అందమైన హీరోయిన్స్ కి ట్రోలింగ్ చేసే వారి బెడద అన్ లైన్ లో మరింత ఎక్కువ. ఇక టాలెంటెడ్ హాట్ బ్యూటీ సమంతకి మాత్రం ఆన్ లైన్ ఆకతాయిల తలనొప్పి తప్పుతుందా చెప్పండి? 


ఈ మధ్య తన సొషల్ మీడియా అకౌంట్లో సామ్ ఓ ఫోటో అప్ లోడ్ చేసింది. అందులో ఆమె తన పెట్ డాగా ‘సాషా’తో ఆడుకుంటూ ఉండటం మనం గమనించవచ్చు. జిమ్ లో వర్కవుట్ తరువాత సామ్ ఇలా రిలాక్స్ అవుతూ కెమెరాకు ఫోజ్ ఇవ్వటం చాలా మందికి క్యూట్ గానే అనిపించింది. కానీ, ఒకరిద్దరు మాత్రం ‘తోక వంకర’ చందంగా సమంత పర్సనల్ లైఫ్ గురించి నెగటివ్ కామెంట్స్ చేశారు. వారిలో ఒకరు ‘‘తను... చివరకు కుక్కలు, పిల్లులతోనే ఒంటరిగా చనిపోతుంది’’ అని దురుసుగా మాట్లాడాడు. అది చూసి సామ్ చాలా కూల్ గా రిప్లై ఇచ్చింది. ‘‘నన్ను నేను అదృష్టవంతురాలిగా భావిస్తా...’’ అంది!

తిక్కగా మాట్లాడిన నెటిజన్... నేను లక్కీ అంటూ షాకిచ్చిన Samantha

కుక్కలు, పిల్లుల మధ్య ఒంటరిగా చనిపోతే... తాను దాన్ని అదృష్టంగా భావిస్తానని... సమంత బదులివ్వటంతో సదరు ట్విట్టర్ యూజర్ సైలెంట్ అయిపోయాడు. అంతే కాదు, కామెంట్ డిలీట్ కూడా చేసేశాడు. సామ్ ఫ్యాన్స్ చాలా మంది నెగటివ్ కామెంట్ చేసిన నెటిజన్ కు చీవాట్లు కూడా పెట్టారు. ప్రస్తుతం సమంత రిప్లై ఇచ్చిన ట్వీట్ స్క్రీన్ షాట్ రూపంలో వైరల్ అవుతోంది...    

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement