Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 01 Jul 2022 11:24:31 IST

Hrithik Roshanలాగా గడ్డం పెంచమని భర్తకు Katrina Kaif సలహా.. Vicky Kaushal రియాక్షన్ ఇదీ..

twitter-iconwatsapp-iconfb-icon

బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ జంట ఒకటి. గతేడాది డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఓ కోటలో ఈ లవ్‌బర్డ్స్ ఎంతో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి వీరికి సంబంధించిన ప్రతి విషయం వేగంగా నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన ఓ సంభాషణ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. బాలీవుడ్‌ నటుడు హృతిక్ రోషన్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ముఖ్యంగా ఆయనకి లేడీ ఫ్యాన్స్ ఎక్కువ.


హృతిక్ తాజాగా గడ్డానికి సంబంధించిన ఓ ప్రకటనలో నటించాడు. అందులో ఎంతో స్టైల్‌గా ఉన్నాడు. దానికి సంబంధించిన ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్ చేసింది. దానికి.. ‘గడ్డంలో హృతిక్ రోషన్ నచ్చాడు’ అని రాసుకొచ్చింది. అలాగే.. దానికి భర్త విక్కీ కౌశల్‌ని ట్యాగ్ చేసింది. అనంతరం కొద్దిసేపటికే భార్యకి రిప్లై ఇచ్చాడు. కత్రినా స్టోరీని షేర్‌ చేసిన విక్కీ.. ‘మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది’ అంటూ రాసుకొచ్చాడు. వీరి మధ్య జరిగిన కన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. విక్కీ ప్రస్తుతం భూమి పెడ్నేకర్, కియారా అడ్వాణీతో కలిసి ‘గోవింద నామ్ మేరా’లో, సారా అలీఖాన్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే.. కత్రినా సైతం విజయ్ సేతుపతితో కలిసి ‘మెర్రీ క్రిస్మస్’, సల్మాన్ ఖాన్‌తో ‘టైగర్ 3’, ‘ఫోన్ భూత్’ అనే మరో చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.

Hrithik Roshanలాగా గడ్డం పెంచమని భర్తకు Katrina Kaif సలహా.. Vicky Kaushal రియాక్షన్ ఇదీ..


Hrithik Roshanలాగా గడ్డం పెంచమని భర్తకు Katrina Kaif సలహా.. Vicky Kaushal రియాక్షన్ ఇదీ..


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement