Abn logo
Aug 4 2021 @ 01:20AM

సినీ నటుడు రాఖీకి చిరు సత్కారం

సర్పవరం జంక్షన్‌, ఆగస్టు 3: కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేట జన చైతన్య లేఅవుట్‌లో బీజేపీ నాయకుడు కవికొండల భీమశంకర్‌ ఆధ్వర్యంలో వర్ధ మాన సినీ నటుడు రాఖీని సెన్సార్‌ బోర్డు సభ్యుడు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ సినీ హీరో వెంకటేష్‌ నటించిన ‘నారప్ప’ చిత్రంలో హీరో చిన్న కుమారుడిగా రాఖీ నటించడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో కాళ్ల ధనరాజు, అనపర్తి వెంకటేష్‌, బొలిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.