Jul 29 2021 @ 18:58PM

చెన్నై టు పుదుచ్చేరి.. రెహమాన్‌ సైక్లింగ్‌

సినీ సెలెబ్రిటీలు తమ అందంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటారు. వయసు మీదపడుతున్నప్పటికీ నాజుగ్గా ఉండేందుకు గంటల కొద్దీ జిమ్‌లలో గడుపుతుంటారు. అయితే, ఇటీవలి కాలంలో సినీ నటీనటులు సైక్లింగ్‌ ఓ హాబీగా మార్చుకున్నారు. కుర్రకారు హీరోయిన్ల నుంచి ముదురు హీరోల వరకు ఈ సైక్లింగ్‌ చేస్తున్నారు. తాజాగా సీనియర్‌ నటుడు రెహమాన్‌ చెన్నై నుంచి పుదుచ్చేరి వరకు సైక్లింగ్‌ చేశారు. మొత్తం 150 కిలోమీటర్లను లక్ష్యంగా పెట్టుకుని ఈ సైక్లింగ్‌ ప్రారంభించిన రెహమాన్‌ 110 కిలోమీర్ల దూరం ప్రయాణించారు. గత ఆదివారం వేకువజామున 3 గంటలకు ప్రారంభమైన ఈ సైక్లింగ్‌... మధ్యాహ్నం 2 గంటల వరకు సాగింది. 11 గంటల పాటు ఏకబిగువున సాగిన ఈ సైక్లింగ్‌ 110 కిలోమీటర్ల దూరం సాగింది. ఈ సైక్లింగ్‌లో రెహమాన్‌తో పాటు ఆయన ఆరుగురు స్నేహితులు పాల్గొన్నారు.