చట్టాల ఉపసంహరణ రైతుల విజయమే: ఆర్.నారాయణమూర్తి
ABN , First Publish Date - 2021-11-25T01:29:31+05:30 IST
మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ, వాటిని కేంద్రం
మహబూబ్ నగర్: మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ, వాటిని కేంద్రం ఉపసంహరించుకోవడం రైతుల విజయమేనని సినీ నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. పట్టణంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 27న విడుదల కానున్న "రైతన్న" సినిమాను ఆదరించాలని కోరారు. కేంద్రం అనాలోచితంగా తీసుకువచ్చిన మూడు రైతు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులపై ఈ చిత్రం నిర్మించామని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో రైతుల కష్టాలను, జీవితాలను వివరించామన్నారు. వ్యవసాయం చేసే రైతు లేకపోతే అన్నం దొరకడం కష్టమవుతుందన్నారు.