Abn logo
Jul 26 2021 @ 16:44PM

యడియూరప్ప రాజీనామాపై స్పందించిన హీరోయిన్ ప్రణీత

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్ప రాజీనామా చేయడంపై సినీ నటి ప్రణీత సుభాష్ స్పందించారు. రాబోయే రోజుల్లో కర్ణాటక రాజకీయాల్లో యడియూరప్ప లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని, కింది స్థాయి నుంచి ఎదిగిన నేత కృషి దశాబ్దాలపాటు గుర్తుండిపోతుందని ఆమె అన్నారు. సోమవారం తన ట్విట్టర్ ఖాతా స్పందిస్తూ యడియూరప్పను కొనియాడారు.


‘‘శ్రీ యడియూరప్ప గారు లేని లోటు కర్ణాటక రాజకీయాల్లో రాబోయే రోజుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక అట్టడుగు నాయకుడు, సైద్ధాంతిక పోరాట యోధుడు. ఆయన చేసిన కృషి, పాలన దశాబ్దాలపాటు గుర్తుండిపోతుంది’’ అనే అర్థంలో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ‘‘బీఎస్‌వైరాజీనామా’’ అనే హ్యాష్‌ట్యాగ్ జత చేశారు.