Abn logo
Jul 13 2020 @ 06:55AM

షూటింగ్ ప్రారంభ‌మైన కొద్దిరోజుల‌కే న‌టునికి క‌రోనా పాజిటివ్‌!

క‌రోనా వైర‌స్ లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లు కొంత‌కాలం నిలిచిపోయిన విష‌యం విదిత‌మే. అయితే ఇటీవ‌లే అన్‌లాక్ మొద‌లు కావ‌డంతో తిరిగి టీవీ సీరియ‌ల్స్ షూటింగ్‌లు ప్రారంభ‌మ‌య్యాయి. హిందీ సీరియ‌ల్ కసౌటీ జిందగీ కే షూటింగ్ ప్రారంభ‌మైన కొద్దిరోజుల‌కే న‌టుడు పార్థ్ సమ్దాన్ కరోనా బారిన ప‌డిన‌ట్లు తేలింది. దీంతో ఈ సీరియ‌ల్ న‌టులు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వ‌హిస్తున్నారు. ఈ సీరియ‌ల్ షూటింగ్ జ‌రుగుతున్న‌ క్లిక్ నిక్సన్ స్టూడియోను సీల్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఇదే సీరియ‌ల్‌లో న‌టిస్తున్న క‌ర‌ణ్ మాట్లాడుతూ పార్థ్ యంగ్ అండ్ ఫిట్ బాయ్. వీలైనంత త్వరగా ఈ వైరస్ నుంచి కోలుకుంటాడు. అతను త్వరగా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నాన‌ని తెలిపారు. షూటింగ్ జ‌రిగేట‌ప్పుడు‌ న‌టులు, సిబ్బంది క‌రోనా సోక‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కోరారు. 

Advertisement
Advertisement
Advertisement