ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 6 వేల విలువైన ఇయర్ ఫోన్స్ ఆర్డర్ చేసిన నటుడు.. బాక్స్‌లో..

ABN , First Publish Date - 2021-10-15T22:27:01+05:30 IST

ప్రముఖ టెలివిజన్ నటుడు, ‘అనుపమ’ వెబ్ సిరీస్‌తో పేరు తెచ్చుకున్న పరాస్ కల్నావత్‌కు ఫ్లిప్‌కార్ట్ షాకిచ్చింది. దసరా

ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 6 వేల విలువైన ఇయర్ ఫోన్స్ ఆర్డర్ చేసిన నటుడు.. బాక్స్‌లో..

ముంబై: ప్రముఖ టెలివిజన్ నటుడు, ‘అనుపమ’ వెబ్ సిరీస్‌తో పేరు తెచ్చుకున్న పరాస్ కల్నావత్‌కు ఫ్లిప్‌కార్ట్ షాకిచ్చింది. దసరా పండుగను పురస్కరించుకుని ఫ్లిప్‌కార్ట్ ఇటీవల బిగ్‌బిలియన్ డేస్ సేల్ నిర్వహించింది. ఇందులో భాగంగా పరాస్ రూ. 6 వేల విలువైన ‘నథింగ్ ఇయర్ (1) ఇయర్ ఫోన్స్‌ను బుక్ చేశాడు. డెలివరీ బాయ్ తెచ్చిచ్చిన ప్యాక్‌ను విప్పి చూసిన పరాస్ షాకయ్యాడు. అతడు ‘నథింగ్ ఇయర్ (1) ఇయర్ ఫోన్స్‌ను బుక్ చేస్తే విచిత్రంగా పార్సిల్‌లోనూ ‘నథింగ్’ (ఏమీ లేదు). ఖాళీగా ఉన్న బాక్స్‌ను చూసిన పరాస్‌కు మతిపోయినంత పనైంది.   


షాక్ నుంచి తేరుకున్న పరాస్ వెంటనే ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. బాక్స్‌లో ఏమీ లేదని, ఫ్లిప్‌కార్ట్ నిజంగా దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది ఇలాగే కొనసాగితే ఇకపై ఎవరూ ఫ్లిప్‌కార్ట్‌ వైపు ఎవరూ చూడరని పేర్కొన్నారు. అతడి ట్వీట్‌కు ఫ్లిప్‌కార్ట్ వెంటనే స్పందించింది. జరిగిన తప్పుకు క్షమాపణలు తెలిపింది. తాము సాయం చేయడానికే ఉన్నామని, వెంటనే ఆర్డర్ ఐడీ పంపిస్తే జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటామని పేర్కొంది. సమాధానం కోసం ఎదురుచూస్తుంటామని తెలిపింది. 


ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ చాలామందికి ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. రెండు రోజుల క్రితం ఓ వినియోగదారుడు బిగ్‌బిలియన్ డేస్‌ సేల్‌లో యాపిల్ ఐఫోన్ 12 ఆర్డర్ చేశాడు. కానీ అతడికి ఐఫోన్ బదులు రెండు నిర్మా సబ్బులు వచ్చాయి. దీంతో అతడు ప్లిప్‌కార్ట్‌కు ఫిర్యాదు చేస్తే డబ్బులు వెనక్కి వచ్చాయి. 

Updated Date - 2021-10-15T22:27:01+05:30 IST