Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 29 Jun 2022 15:12:33 IST

Nassar సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడా..?

twitter-iconwatsapp-iconfb-icon

తెలుగు, తమిళ సినిమాల్లో నటించి ఫేమ్ సంపాదించుకున్న నటుడు నాజర్(Nassar). యస్‌యస్.రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన  ‘బాహుబలి’ చిత్రంలో బిజ్జల దేవ (Bijjaladeva) పాత్రతో ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీలో రానాకు తండ్రిగా కనిపించారు. ఆయన సినిమాలకు టాటా చెప్పబోతున్నారని కోలీవుడ్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. 


ఆరోగ్య కారణాల రీత్యా మూవీస్‌కు బై బై చెప్పాలనే ఆలోచనలో ఆయన ఉన్నారని సమాచారం. కరోనా అనంతరం గుండె సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. అందువల్లే సినీ ఇండస్ట్రీకీ టాటా చెప్పాలనే ఆలోచనలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా నాజర్ మీడియాతో మాట్లాడారు. తాను చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు వెల్లడించారు. నాజర్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వక ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేశారు. అనంతరం ఆయనకు నటన మీద ఆసక్తి కలిగింది. దీంతో సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్, తమిళనాడు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ టెక్నాలజీస్ నుంచి యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. కె. బాల చందర్ దర్శకత్వం వహించిన ‘కల్యాణ అగతిగల్’ (Kalyana Agathigal) తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. మణిరత్నం తెరకెక్కించిన ‘నాయకుడు’ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో కనిపించారు. ఇండస్ట్రీలోని  24 క్రాఫ్ట్స్‌లో నాజర్‌కు ప్రావీణ్యముంది.  నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడు, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ వంటి పాత్రల్లో ఆయన దర్శనమిచ్చారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement