Advertisement
Advertisement
Abn logo
Advertisement

నా విజయవాడకు రావడం చాలా సంతోషం: Mohan babu

విజయవాడ: సినీ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు విజయవాడ చేరుకున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో మోహన్‌బాబుకు అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘నా విజయవాడకు రావడం నాకు చాలా సంతోషం’’ అని అన్నారు. ఆత్మీయులను కలిసేందుకు విజయవాడకు వచ్చానని తెలిపారు. ఆపై ఎయిర్‌పోర్టు నుంచి పెదపారుపూడి మండలం వానపాముల గ్రామానికి కలెక్షన్ కింగ్ బయల్దేరి వెళ్లారు. ఏపీ అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తల్లి రంగనాయకమ్మ ఇటీవల మృతి చెందటంతో ఆ కుటుంబాన్ని మోహన్‌బాబు పరామర్శించనున్నారు. అనంతరం ఏపీ సీఎం జగన్‌ను కలిసేందుకు వెళ్లనున్నట్లు సమాచారం. 

Advertisement
Advertisement