Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 24 Jan 2022 19:40:23 IST

స్వాతంత్య్ర సమరయోధులకు నివాళిగా.. 12 విభిన్న గెటప్‌లలో నటుడు

twitter-iconwatsapp-iconfb-icon
స్వాతంత్య్ర సమరయోధులకు నివాళిగా.. 12 విభిన్న గెటప్‌లలో నటుడు

భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని స్వాతంత్య్ర సమర యోధులకు నివాళిగా ఒక నటుడు 12 మంది సమర యోధుల గెటప్‌లలో కనిపించనున్నారు. ఆయన గతంలో తెలుగులో ‘రాజుగారి గది’, ‘మంత్ర-2’లో నటించగా.. తమిళంలో ‘కరుంగళి’, ‘నాన్‌ సిగప్పు మణిదన్‌’ వంటి చిత్రాల్లో నటించారు. ఇపుడు ఏకంగా 12 విభిన్న గెటప్‌లలో కనిపించనున్నారు. వాటికి సంబంధించిన ప్రీ లుక్‌ను తాజాగా రిలీజ్‌ చేయగా, ఈ నెల 26వ తేదీ ఉదయం 10.05 గంటలకు స్వాతంత్య్ర సమరయోధుల పాత్రలకు సంబంధించిన 12 గెటప్‌లను రిలీజ్‌ చేసేలా ప్లాన్‌ చేశారు. 


దీనిపై చేతన్‌ చీను మాట్లాడుతూ.. కొన్నేళ్ళ కిత్రం ఈ ఆలోచనపై తన సోదరి వద్ద చర్చించగా, ఇంతకాలానికి ఇది కార్యరూపం దాల్చిందన్నారు. ఇప్పటికే 12 రకాల గెటప్‌లతో క్యాలెండర్‌ కోసం ఫొటో షూట్‌ చేశాం. దాని మేకింగ్‌ వీడియోను కూడా త్వరలోనే రిలీజ్‌ చేస్తాం. రిపబ్లిక్‌ వేడుకలను పురస్కరించుకుని, స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునేలా 12 మంది ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ ఫొటోలను రిలీజ్‌ చేస్తాం. వారిలో వీవీఎస్‌ అయ్యర్‌, అల్లూరి సీతారామరాజు, ఉదమ్‌ సింగ్‌, వేలు తంబి దళవ, వీరపాండి కట్టబొమ్మన్‌, సంగోలి రాయన్న, మంగళ్‌ పాండే, రాణి వేలు నాచ్చియార్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, ఛత్రపతి శివాజీ, సుఖ్‌దేవ్‌ తపర్‌, వినాయక్‌ దామోదర్‌ సవార్కర్‌ వంటి పోరాటయోధులున్నారు.. అని వివరించారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International