Mathura Krishna జన్మభూమి ఈద్గా కాంప్లెక్స్‌లోకి అనుమతి నిరాకరణ

ABN , First Publish Date - 2022-05-12T17:50:25+05:30 IST

మథురలోని వివాదాస్పద కృష్ణ జన్మభూమి-ఈద్గా కాంప్లెక్స్‌లోకి ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యకర్తలకు భద్రతా బలగాలు అనుమతి నిరాకరించాయి....

Mathura Krishna జన్మభూమి ఈద్గా కాంప్లెక్స్‌లోకి అనుమతి నిరాకరణ

మథుర(ఉత్తరప్రదేశ్): మథురలోని వివాదాస్పద Krishna జన్మభూమి-ఈద్గా కాంప్లెక్స్‌లోకి ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యకర్తలకు భద్రతా బలగాలు అనుమతి నిరాకరించాయి. కృష్ణ జన్మభూమి-ఈద్గా కాంప్లెక్స్‌లోకి ప్రవేశించేందుకు ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యకర్తలు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కి అనుబంధంగా ఉన్న ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఎంఆర్ఎం) కార్యకర్తలు సైట్ యొక్క చారిత్రక ప్రాముఖ్యతను విశ్లేషించడానికి కాంప్లెక్స్‌కు వెళ్లినట్లు సమాచారం.ఎంఆర్‌ఎం టీమ్‌ లీడర్‌ తుషార్‌ కాంత్‌ మాట్లాడుతూ.. కృష్ణ జన్మభూమిని దూరం నుంచి చూశామని, ఈద్గా చరిత్ర గురించి తెలుసుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. 


తాము మంచ్ చీఫ్ ఇంద్రేష్ కుమార్ ఆదేశాల మేరకే బృందం మధుర వెళ్లినట్లు ఆయన చెప్పారు.ఎంఆర్ఎం బృందం సభ్యురాలు రెహానా ఖాతున్ మాట్లాడుతూ, దేశంలో శాంతి,ప్రశాంతతను పరిరక్షించడం మొత్తం ముస్లిం సమాజం యొక్క బాధ్యత అన్నారు. వివాదాస్పద స్థలం శ్రీకృష్ణుడి జన్మస్థలమని, విదేశీ ఆక్రమణదారులు ఈద్గాను నిర్మించేందుకు ఆలయాన్ని కూల్చివేశారని రెహానా ఆరోపించారు.ముస్లింలకు చెందని ప్రదేశంలో నమాజ్ చేయడం సరికాదని జట్టులోని మరో సభ్యుడు ఆసిఫ్ జాఫ్రీ అన్నారు.

Read more