Abn logo
Sep 24 2021 @ 00:45AM

పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న బక్కని నర్సింహులు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు

కళ్యాణ్‌నగర్‌, సెప్టెంబరు 23: రామగుండం నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి కార్యకర్తలు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు పిలుపునిచ్చారు. గురువారం టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ బలోపేతానికి, పూర్వ వైభవానికి కార్యకర్తలు కృషి చేయాలని, సింగరేణిలో రాబోయే గుర్తింపు ఎన్నికల్లో టీఎన్‌టీయూసీని గెలిపించుకోవడానికి కార్యకర్తలు పాటుపడాలని కోరారు. తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వవైభవం తీసుకువస్తానని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో తెలుగు మహిళ అధ్యక్షురాలు జ్యోతి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు, పెద్దపల్లి పార్లమెంట్‌ టీడీపీ కార్యదర్శి కుమార్‌, ఆరీఫ్‌, బైరం శంకర్‌, గుండబోయిన ఓదెలు, చిటికెల రాయలింగు, పెగడపల్లి రాజనర్సు, బరిగె  కళావతి, చిటికెల అశ్విని, అంకిరెడ్డి దామోదర్‌రెడ్డి ఉన్నారు.