టీఆర్‌ఎస్‌ను గద్దె దించేలా కార్యకర్తలు పనిచేయాలి

ABN , First Publish Date - 2022-01-18T06:03:32+05:30 IST

ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేలా కాంగ్రెస్‌ కార్యకర్తలు ఒక ఉద్య మంలా పనిచేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

టీఆర్‌ఎస్‌ను గద్దె దించేలా కార్యకర్తలు పనిచేయాలి

- ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

జగిత్యాల టౌన్‌, జనవరి 17: ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేలా కాంగ్రెస్‌ కార్యకర్తలు ఒక ఉద్య మంలా పనిచేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్‌లో జగిత్యాల నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హాజరై మండలాల వారీగా సభ్యత్వ నమోదుపై కార్యకర్తలు, నాయ కులతో మాట్లాడారు. జాతీయ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, విద్యార్థుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక అనేక ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్‌ కుటుంబం మాత్రం ఐదు ఉద్యోగాలు సాధించుకుందని అన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందని ఆయన మండి పడ్డారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గడప గడపకు కాంగ్రెస్‌ కార్యకర్త వెళ్లి ప్రభుత్వ వ్యతిరేఖ విధానాలను వివరిస్తూ కాం గ్రెస్‌ సభ్యత్వాలు ఇవ్వాలని సూచించారు. జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసేలా కార్యకర్తలు తమ సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చుతున్న ఘనుడు కేసీఆర్‌ అని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులతో పాటు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం తప్పదన్నారు. ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త వారి పరిధిలో  సేవా దృక్పథంతో పనిచేసి ప్రజల్లో మంచి గుర్తింపు పొందాలన్నారు. ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు ఇంచార్జి ఓదెల మండల జడ్పీటీసీ రాములు, నిజామాబాద్‌ పార్టమెంట్‌ సభ్యత్వ ఇంచార్జి అవేజ్‌ నాయకులు గిరి నాగభూషణం, బండ శంకర్‌, మోహన్‌, దేవేందర్‌ రెడ్డి, గాజుల రాజేందర్‌, రమేష్‌, జున్ను రాజేందర్‌, నందయ్య, జీవన్‌, అంజన్న, రమేష్‌ రావు, భాస్కర్‌ రెడ్డి, మధు, రఘవీర్‌తో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-01-18T06:03:32+05:30 IST