చివరలోనూ చురుగ్గా నైరుతి

ABN , First Publish Date - 2020-09-27T09:00:47+05:30 IST

నైరుతి రుతుపవనాలు చివరి దశలోనూ బాగా ప్రభావం చూపుతున్నాయి...

చివరలోనూ చురుగ్గా నైరుతి

  • సీమలో అత్యధిక వర్షపాతం
  • సిక్కోలును వీడని వాన లోటు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

నైరుతి రుతుపవనాలు చివరి దశలోనూ బాగా ప్రభావం చూపుతున్నాయి. మరో 20 రోజుల్లో నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నప్పటికీ రెండు ఉపరితల ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు విస్తారం గా కురుస్తున్నాయి. రాయలసీమ, దక్షిణకోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం 504 మండలాల్లో 5 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వానపడిందని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర మినహా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటికే రాయలసీమలో అధిక వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు మినహా కోస్తాలోనూ అధికంగానే వర్షపాతం నమోదైం ది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువ వ ర్షం కురిసింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సాధారణం కంటే అధికంగానే వాన పడింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటికీ వాన లోటు కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ నుంచి ఇప్పటి వరకు 531 మిల్లీమీటర్లకుగాను 686 మిల్లీమీటర్ల(29.2ుఅధికంగా) వర్షపాతం నమోదైంది. కడప 79.9ు, అనంతపురం 69.5ు, కర్నూలు 68.5ు, చిత్తూరు 61ు, నెల్లూరు 55.2ు, ప్రకాశం 46.5ు, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో 31- 35ు, కృష్ణాలో 22.5ు అధిక వర్షాలు కురవగా, శ్రీకాకుళం 27.8ు, విజయనగరం జిల్లాలో 17ు లోటు ఏర్పడింది. విశాఖజిల్లాలో 1.2ు అధిక వర్షం పడింది. 


ఆందోళనలో అన్నదాత

అధిక వర్షాలకు పంటలు దెబ్బతింటాయని రైతు లు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వరి, వేరుశనగకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. పత్తి, మొక్కజొన్న, అపరాల పైర్లకుకూడా కొంత నష్టం తప్పదంటున్నారు. ఈ ఏడాది వరుస అల్పపీడనాలతో అధిక వర్షాలు కురిసి, చాలా పంట దెబ్బతిం ది. కృష్ణా, గోదావరి వరదలతోనూ ఇంకొంత పంట పాడైంది. కృష్ణా, గోదావరి డెల్టాల్లో సార్వా వరి పొట్టదశకు చేరిన తరుణంలో వరదలు, అధిక వర్షాలు పంటకు నష్టం కలిగించాయి. దాదాపు లక్షన్నర హెక్టార్లలో పంట పాడైందని సమాచారం. అయినా ప్ర భుత్వం నుంచి రైతులకు పరిహారమేమీ అందలేదు. వరదలు, వాన తగ్గి, 2 వారాలు తెరపివ్వడంతో డెల్టా లో ఇప్పుడిప్పుడే వరి కోతలు సాగుతున్నాయి. ఇంతలోనే ఉపరితల ద్రోణులతో ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు సహా రాయసీమలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Updated Date - 2020-09-27T09:00:47+05:30 IST