చురుగ్గా కరోనా వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-04-22T05:06:18+05:30 IST

గరుగుబిల్లి పీహెచ్‌సీ పరిధిలో కరోనా వ్యాక్సినేషన్‌ను చురుగ్గా నిర్వహిస్తున్నారు.

చురుగ్గా కరోనా వ్యాక్సినేషన్‌
ఎస్‌.కోట సీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ కోసం బారులుతీరిన జనం

గరుగుబిల్లి : గరుగుబిల్లి పీహెచ్‌సీ పరిధిలో కరోనా వ్యాక్సినేషన్‌ను చురుగ్గా నిర్వహిస్తున్నారు. 13 సచివాలయాల పరిధిలో సిబ్బందితో పాటు వలంటీర్లు, వీఆర్‌వోలు, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు వైద్య సిబ్బంది దాసరి మృత్యుంజయరావు, ఎంపీహెచ్‌ఈవో బి.శ్రీరాములునాయుడుతో పాటు వైద్య సిబ్బంది కొవిడ్‌ టీకా వేశారు. గ్రామాల్లో కొవిడ్‌ పరీక్షలు విరివి గా నిర్వహిస్తున్నామని వైద్యులు పీఏ ప్రియాంక, కేకే సాగర్‌ తెలిపారు. కరోనాపై ప్రతి ఒక్కరూ అప్రమ త్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.

ఎస్‌.కోటలో బారులు

శృంగవరపుకోట : శృంగవరపుకోట ప్రభు త్వ సామాజిక ఆసుపత్రిలో బుధవారం కొవిడ్‌- 19 టీకా కోసం బారులు తీరారు. ఆర్టీసీ కండక్టర్‌, డ్రైవర్‌ లైతే కుటుంబాలతో సహ వరస కట్టేశారు. అయితే 30 డోస్‌లు వరకు అందించిన సీహెచ్‌సీ సిబ్బంది టీ కాలు వేయలేమంటూ మధ్యలో వెళ్లిపోయారు. దీంతో అంతవరకు క్యూలో నిలబడ్డవారంతా ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతసేపు వేచి ఉన్నా సిబ్బంది రాకపోవడంతో కొందరు సూపరింటెండెంట్‌ త్రినాఽథ రావు వద్దకు వెళ్లి నిలదీశారు. వ్యాక్సినేషన్‌ జరుగు తున్న గదిలోకి పరిమితికి మించి ఎక్కువ మంది వెలుతుండడంతో నిలిపేసినట్లు సూపరింటెండెంట్‌ సమాధానం ఇవ్వడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సిబ్బంది మళ్లీ వ్యాక్షినేషన్‌ను కొనసాగించారు. సూపరింటెండెంట్‌ ఆర్‌.త్రినాథరావు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌ గదిలోకి అందరూ ఒకేసారి వెళ్లడంతో టీకా వేయకుండా సిబ్బంది బయటకు వచ్చేశారని, 120 డోస్‌లు వరకు టీకాలు అందించేందుకు అవకాశం ఉందన్నారు. 


Updated Date - 2021-04-22T05:06:18+05:30 IST